TG Group-1 | గ్రూప్-1 అంశంపై తెలంగాణ హైకోర్టు సోమవారంతో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు తీర్పును రిజర్వ్ చేశారు. గ్రూప్-1 అంశంపై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. మెయిన్స్ పత్రాలు పునః మూల్యాంకనం చేయాలని, మూల్యాంకనం చేయకపోతే మళ్లీ పరీక్షలు పెట్టాలని పిటిషనర్లు కోరారు. గతంలో గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చిన న్యాయమూర్తి రాజేశ్వర్‌రావు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో స్టే ఎత్తివేయాలంటూ గ్రూప్-1కి ఎంపికైన పిటిషన్లు వేశారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయని టీజీపీఎస్సీ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. వాదనలు ఏమైనా మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.