హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి కోర్టులో చుక్కెదురైంది. ఆ సంస్థ గురించి మాట్లాడకుండా ఉండేలా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితరులకు ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు సోమవారం తిరసరించింది. ప్రస్తుతం తమ ముందున్న పిటిషన్‌పై విచారణ చేపట్టకుండా గ్యాగ్ ఆర్డర్‌ను ఇవ్వబోమని జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మసనం స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.