కొత్తపల్లి, ఏప్రిల్ 2: ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి ఉద్యమబాట పట్టినట్టు జేఏసీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ చైర్మన్ జగదీశ్వర్ తెలిపారు. ఈ నెల 1న ప్రారంభమైన ఉద్యమ కార్యాచరణ 30వరకు కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యోగులకు పెం డింగ్ డీఏ విడుదల, ఆరోగ్య కార్డుల మం జూరు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలనే తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.
ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లా ల్లో సదస్సులు నిర్వహించడంతోపాటు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను సమర్పిస్తామని చెప్పారు. నీటిపారుదల శాఖ సీనియర్ అసిస్టెంట్ గూడ రాఘవరెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు న్యా యపరంగా రావాల్సిన 5 డీఏలు, పెండింగ్ బిల్లులు, కంట్రిబ్యూషన్‌తో కూడిన ఎంప్లాయీస్ హెల్త్ సీం, పీఆర్సీ అమలు, విరమ ణ పొందిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.