ఆ ఉత్తర్వుల అమలుకు 4 వారాల గడువు
గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి 2019లో తాము జారీచేసిన ఉత్తర్వుల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మరో 4 వారాల గడువు ఇస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది.
- ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి 2019లో తాము జారీచేసిన ఉత్తర్వుల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మరో 4 వారాల గడువు ఇస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ గడువులోగా ఆ ఉత్తర్వులను అమలు చేయడంతోపాటు సంబంధిత నివేదికను సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ , గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సంతోష్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
గిరిజన సంక్షేమశాఖలో ఐదేండ్ల సర్వీసు పూర్తయినప్పటి నుంచి క్రమబద్ధీకరణ వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వరంగల్ గిరిజన సంక్షేమశాఖ కార్యాలయ ఉద్యోగి యాకూబ్, మరో 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అంశంపై 8 వారాల్లోగా నిర్ణ యం తీసుకోవాలని 2019లో హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో పిటిషనర్లు కోర్టుధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి మరోసారి విచారణ చేపట్టడంతో.. హైకోర్టు ఉత్తర్వుల అమలుకు మరో 4వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

