హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఐఏఎస్ లాంటి ఉన్నత పదవుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదంటూ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
వ్యాఖ్యవల్ల ఎవరి హకులకు భంగం వాటిల్లినట్టు ఆధారాలు లేవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యలతో దివ్యాంగుల రిజర్వేషన్లు తొలగించడం కూడా జరగలేదంది.