పతంజలి ఫుడ్స్ అప్పీల్ కొట్టివేత.. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ జోన్ రద్దు చట్టబద్ధమేనన్న హైకోర్టు
సూర్యాపేట జిల్లాలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కు కేటాయించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ జోన్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి మరో సంస్థకు కేటాయించడం చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చింది. నిర్ణీత గడువులో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయకపోవడం, నిర్దేశిత ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను సాధించడంలో సంస్థ విఫలమవడాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నదని పేర్కొన్నది.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కు కేటాయించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ జోన్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి మరో సంస్థకు కేటాయించడం చట్టబద్ధమేనని హైకోర్టు తేల్చింది. నిర్ణీత గడువులో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయకపోవడం, నిర్దేశిత ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను సాధించడంలో సంస్థ విఫలమవడాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నదని పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం పతంజలి ఫుడ్స్ దాఖలు చేసిన రిట్ అప్పీల్ నంబర్ 102/2026ను కొట్టివేసింది. 2025 మార్చి 15న జారీచేసిన జీవో-13 ద్వారా సూర్యాపేట ఫ్యాక్టరీ జోన్ కేటాయింపును రద్దు చేయడం, జీవో-14 ద్వారా అదే జోన్‌ను నాలుగో ప్రతివాదికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సంస్థ ఈ అప్పీల్ వేసింది.
2017 మార్చి 15న కుదిరిన ఎంవోయూలోని క్లాజ్లు 5(బీ), 6 ప్రకారం 24 నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, రెండేండ్లలో స్థలాన్ని గుర్తించడం సంస్థ బాధ్యత అని కోర్టు పేరొన్నది. క్లాజ్-13 ప్రకారం సాగు విస్తీర్ణం పెంపు, నర్సరీలు, మిల్లు, రిఫైనరీ ఏర్పాటుపై అవసరమైన సమాచారం ఇవ్వాల్సి ఉన్నదని, విఫలమైతే డిపాజిట్ జప్తు, జోన్ రద్దు వంటి చర్యలు ఉంటాయని తెలిపింది. సూర్యాపేట జోన్లో ప్రతిపాదిత విస్తీర్ణంలో సుమారు 14% మాత్రమే సాగులోకి వచ్చిందని, అదే సమయంలో నల్లగొండ జోన్లో పనితీరు సుమారు 36 శాతంగా ఉన్నందున ఆ జోన్‌ను పతంజలి వద్దే కొనసాగించినట్టు తెలిపింది.
సాగు లక్ష్యాల లోపాలను 2022, 2023, 2024లో జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లోనే ప్రభుత్వం ప్రస్తావించిందని పేర్కొన్నది. పతంజలి ఫుడ్స్‌కు పలుమార్లు నోటీసులు ఇచ్చి, సమాధానాలు స్వీకరించి, వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, అందువల్ల చర్య ఏకపక్షం కాదని తేల్చింది. నల్లగొండ జోన్‌ను కొనసాగిస్తున్నందున అకడ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకొనే అవకాశం సంస్థకు ఉన్నదని, సూర్యాపేట జోన్‌ను మరో అర్హత కలిగిన సంస్థకు కేటాయించడం ప్రభుత్వ పథకం లక్ష్యాలకు అనుగుణమేనని పేరొంటూ సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది.
మత్స్యకారుల సభ్యత్వ వివాదంపై తాజాగా విచారణ
- హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలోని మత్స్యకార సహకా ర సంఘంలో సభ్యత్వం కోరిన 60 మంది దరఖాస్తుల తిరసరణకు సంబంధించిన కేసును తాజాగా విచారించాలని హైకోర్టు ఆదేశించింది. తమకు నోటీసులు ఇవ్వకుం డా, వాదనలు వినకుండానే సింగిల్ జడ్జి తీ ర్పు ఇచ్చారంటూ సంఘం దాఖలు చేసిన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం అనుమతించింది. సభ్యత్వ దరఖాస్తులను తిరసరిస్తూ 2024 ఫిబ్రవరి 23న అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ జారీ చేసిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి రద్దు చేశారు. ఆ తీర్పును ధర్మా సనం కొట్టివేసింది. అయితే, 60 మంది పిటిషనర్ల సభ్యత్వ హకుపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

