మహబూబ్‌నగర్ అర్బన్, మే 30 : కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాబోయే రోజుల్లో మళ్లా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అమెరికాలోని డాలస్ రాష్ట్రంలో శుక్రవారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఎన్ఆర్ఐ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం డాలస్‌లోని గాంధీ పార్కు వద్ద నిర్వహించిన కారు ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ జూన్ 1న డాలస్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాష్ర్టాభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం ఎంతో అవసరమని కోరారు.