హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): టెట్‌ను ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని రా ష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం జీవో -16ను విడుదల చేశారు. ప్రతి ఏడాది జూన్‌లో, డిసెంబర్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
తమ స్కోర్‌ను పెంచుకునేందుకు ఎన్నిసాైర్లెనా టెట్‌కు హాజరుకావొచ్చు. ఆ మార్కులకు డీఎస్సీలో 20శాతం వెయిటేజీ అమల్లో ఉంది. గతంలోనే టెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహించాలని ఎన్సీటీఈ రాష్ర్టాలను ఆదేశించింది. టెట్ గడువును జీవితకాలానికి పొడిగించింది.