హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రిజర్వాయర్ల నిర్వహణపై తెలంగాణ చేసిన విజ్ఞప్తులను నదీ యాజమాన్య కమిటీ (ఆర్ఎంసీ) పట్టించుకోలేదని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆర్ఎంసీ రూపొందించిన ముసాయిదాను మార్చాల్సిందేనని డిమాండ్చేసింది. ఈ నివేదికలో తెలంగాణ సూచనలను పక్కనబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈఎన్సీ మురళీధర్ తాజాగా ఆర్ఎంసీ కన్వీనర్‌కు లేఖ రాశారు. తెలంగాణ ఇప్పటివరకు మూడుసార్లు లేఖలు రాసినా ఫలితం లేదని, ఏపీ ప్రతిపాదనలను మాత్రం నివేదికలో పొందుపరిచారని మండిపడ్డారు.
1. జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ
శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి పంపకానికి సంబంధించి : విద్యుదుత్పత్తి 76-24% (తెలంగాణ: ఏపీ) విధానంలో ఉండాలి. నాగార్జునసాగర్ పరీవాహకం అవసరాలకు అనుగుణంగా శ్రీశైలం నుంచి నీటిని విడుదల చే స్తూ, జల విద్యుత్తును తెలంగాణ అవసరాలకు వాడుకుంటుంది. వరదల సమయంలో రెండు రాష్ట్రాలు పూర్తిసామర్థ్యంతో విద్యుదుత్పత్తి ఉత్పత్తి చేసుకోవచ్చు.సాగర్, పులిచింతలలో విద్యుదుత్పత్తిపై: నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టా పథకాలకు నీటి విడుదల అవసరం లేదు.
రివర్సబుల్ పంపింగ్‌పై : నిర్వహణ సమస్యలు, సర్వీస్ ఆపరేషన్స్, లోడ్ డిస్పాచ్ సమస్యల వంటి ఇబ్బందుల కారణంగా రివర్సబుల్ పంపింగ్ సాధ్యం కాదు.
2. రూల్ కర్వ్..
సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు 12 టీఎంసీల విడుదలపై.. : కేడబ్ల్యూడీటీ-1, జీడబ్ల్యూడీటీ ప్రకారం కృష్ణా డెల్టా అవసరాలకు సాగర్ నీటి విడుదల అవసరం లేదు. బేసిన్ బయటి అవసరాలకు శ్రీశైలం నుంచి ఏపీకి 34 టీఎంసీల కన్నా ఎకువ విడుదల చేయరాదు. అందుకు తగ్గట్టుగా శ్రీశైలంలో నీటిమట్టం కొనసాగించాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఎస్సెల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులు చేపట్టిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున జలాలను తాతాలిక పంపిణీ చేపట్టాలి.
3. మిగులు జలాలపై విధానం
ప్రాజెక్టులు నిండి పొర్లిపోయే జలాలను రాష్ట్రాల వాటాతోపాటు లెకించాల్సిందే. వరదల సమయంలో పొర్లిపోయే నీటిని ఏపీ తీసుకోవాలనుకుంటే.. ఆ మేరకు నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల నిల్వల నుంచి తెలంగాణ వినియోగించుకొనేందుకు అంగీకరించా లి. 5వ ఆర్ఎంసీ సమావేశం నిర్వహించే సమయానికి తెలంగాణ ప్రతిపాదనలకు అనుగుణంగా ముసాయిదాను మార్చాలని ఈఎన్సీ మురళీధర్ స్పష్టంచేశారు. లేదంటు సమావేశానికి వచ్చినా ప్రయోజనం ఉండబోదన్నారు.
సమావేశాన్ని వాయిదా వేయండి
వచ్చే నెల 2న నిర్వహించనున్న ఆర్ఎంసీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ చైర్మన్‌ను కోరారు. 3వ తేదీన తిరువనంతపురంలో ‘సదరన్ జోనల్ కౌన్సిల్ (ఎస్‌జడ్‌సీ) సమావేశం’ ఉన్నదని గుర్తుచేశారు. ఆ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఆర్ఎంసీ మీటింగ్‌కు హాజరుకావడం కష్టమని పేర్కొన్నారు.