హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23నే దసరా సెలవును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ నెల 24న విజయదశమి సెలవును ఖరారు చేసింది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర విద్వత్సభ దసరాను 23నే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ మేరకు 24న సెలవును 23కు మార్చుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 24వ తేదీ కూడా సెలవు దినమేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.