హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.9,99,70,000ను ప్రభుత్వం విడుదల చేసిందని వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసివుల్లా ఖాన్ వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ వేతనాలు విడుదలయ్యాయని చెప్పారు.
నాంపల్లిలోని అనీసుల్ గుర్బా మాడల్ అనాథాశ్రమం లో మల్టీపర్పస్ కాంప్లెక్స్‌కు 4.25 కోట్లు, జామియా నిజామియా ఆడిటోరియానికి 30.76 లక్షలు, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, జగిత్యాలలో (136) వక్ఫ్ సంస్థల భవన నిర్మాణాలు, మరమ్మతులకు 9.7 కోట్లను విడుదల చేసిందన్నారు.