హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 588 కుటుంబాల్లోని సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం కలిగించే చర్యలో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ చర్యలు చేపట్టింది.
పలు కుటుంబాల దుస్థితిని వివరిస్తూ తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) చైర్మన్ ఎం జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎలూరి శ్రీనివాసరావు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కుటుంబాలకు జీవనోపాధిని కలిగించటానికి సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించింది.