హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2023 సంవత్సరపు సాధారణ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాదిలో సాధారణ సెలవులు 28 ఉన్నాయి. ఆప్షనల్ హాలిడేలు 24, నెగోషియబుల్ యాక్ట్ కింద 23 సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
సాధారణ సెలవుల్లో భాగంగా నూతన సంవత్సరం, సంక్రాంతి, దీపావళి, రంజాన్ ఆదివారం వచ్చాయి. భోగి, బతుకమ్మ ప్రారంభం రెండో శనివారం వచ్చాయి. మొత్తం 24 ఆప్షనల్ హాలిడేస్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు ఆప్షనల్ హాలిడేలను ఉపయోగించుకొనే వెసులుబాటు ఉన్నది.