సినీ పరిశ్రమకు అండగా తెలంగాణ ప్రభుత్వం : మంత్రి తలసాని
సినీ పరిశ్రమకు అండగా | చలన చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

హైదరాబాద్ : చలన చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయి పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైందని, వారిని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సినీ కార్మికులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందేలా చూడాలని కోరారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. లాక్డౌన్ ముగిసిన వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసిందని అందరూ సహకరించాలని కోరారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మంత్రిని కలిసిన వారిలో తెలుగు సినీ పరిశ్రమ అధ్యక్షుడు అనిల్ కుమార్, పీఎస్ఎన్, దొర, చిత్రపురి కాలనీ సెక్రెటరీ కాదంబరి కిరణ్ తదితరులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

