Telangana | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయింది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.