హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదలు చేసింది. సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 50 శాతానికి మించని రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లేందుకు సర్కారు సిద్ధమైంది.
రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలని జీవోలో పేర్కొన్నది. వంద శాతం ఎస్టీలు ఉన్న గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు అన్నీ ఎస్టీలకే రిజర్వ్ అవుతాయని తెలిపింది.