EWS Reservation | పారా మెడికల్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి వైద్యారోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి 10 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. బీపీటీ, ఎంపీటీ, ఎమ్మెస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేయనున్నారు.
Paramedical Reservations