కరువుపై క్యాబినెట్ సబ్‌కమిటీ
రాష్ట్రంలో కరువు, ఎల్ నినో పరిస్థితులను సమీక్షించి వాటిని ఎదురొనేందుకు తగిన చర్యలు, సిఫారుసులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎల్ నినో పరిస్థితులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.
- పరిస్థితులపై సమీక్ష, చర్యలు, సిఫార్సులకు ఏర్పాటు
- చైర్మన్‌గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార
- కమిటీలో సభ్యులుగా ఐదుగురు మంత్రులు
హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కరువు, ఎల్ నినో పరిస్థితులను సమీక్షించి వాటిని ఎదురొనేందుకు తగిన చర్యలు, సిఫారుసులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎల్ నినో పరిస్థితులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చైర్మన్‌గా, సభ్యులుగా మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క, తుమ్మల, వాకిటి శ్రీహరిని నియమించింది. సోమవారం సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీచేశారు.
ఈ కమిటీలో సీఎం సలహాదారు కే రామకృష్ణారావు ప్రత్యేక ఆహ్వానితుడిగా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తారు. ప్రణాళికా శాఖ కార్యదర్శి ఈ ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్రంలోని కరువు ప్రభావంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుంది. క్షేత్రస్థాయి సమస్యలను అధిగమించేందుకు సంబంధిత శాఖలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేస్తుంది. రాష్ట్రానికి అవసరమైన కరువు సహాయక చర్యలు, నిధుల కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రధాన అంశాలపై కూడా ఈ ఉపసంఘం నివేదికలు సమర్పిస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

