పథకం ప్రకారమే పీవీకి అవమానం
మాజీ ప్రధాని, తన తండ్రి అయిన దివంగత పీవీ నరసింహారావుపై పథకం ప్రకారమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. సోనియా ఆత్మకథ పుస్తకం మార్కెట్లోకి విడుదలైన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ తన ఆత్మకథలో ఓ వైపు పీవీ అంటే ఎంతో గౌరవమని, తమ కుటుంబానికి ఆప్తుడని పేర్కొన్నారని..
-
ఆయన త్యాగాన్ని అవమానించిన కాంగ్రెస్
-
రాజీవ్ హత్యకేసులో పీవీ ఉదాసీనంగా వ్యవహరించారని సోనియా చెప్పడం బాధాకరం
-
బాబ్రీ మసీదు కూల్చివేతలో పీవీ కుట్ర అబద్ధం
-
సోనియాగాంధీ రాసిన ఆత్మకథలో అభాండాలేయడం దురదృష్టకరం
-
మీడియాతో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని, తన తండ్రి అయిన దివంగత పీవీ నరసింహారావుపై పథకం ప్రకారమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. సోనియా ఆత్మకథ పుస్తకం మార్కెట్లోకి విడుదలైన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ తన ఆత్మకథలో ఓ వైపు పీవీ అంటే ఎంతో గౌరవమని, తమ కుటుంబానికి ఆప్తుడని పేర్కొన్నారని..
మరోవైపు రాజీవ్‌గాంధీని అవమానించేలా వ్యవహరించారని చెప్పడం శోచనీయమని గద్గదస్వరంతో చెప్పారు. రాజీవ్ హత్యకేసు విచారణలో ఉదాసీనంగా వ్యవహరించినట్టు వెల్లడించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేశారు. రాజీవ్ హత్యకేసు దర్యాప్తు ఇప్పటికీ ముగియలేదనే విషయాన్ని వాణీదేవి గుర్తుచేశారు. తమ కుటుంబాన్ని అణచివేసేందుకు యత్నించినందునే పీవీ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలోకి నాడు అనుమతించలేదని సోనియా స్వయంగా వెల్లడించిందనే విషయం తెలిసి ఎంతగానో బాధేసిందని చెప్పారు. గతంలో ప్రధానిగా పనిచేసిన ఏ నేతకు కూడా ఇలాంటి అవమానం జరుగలేదని తెలిపారు. బాబ్రీమసీదు కూల్చివేతకు పరోక్షంగా పీవీ కారణమని పుస్తకం ద్వారా సోనియా చెప్పినట్టు తెలిసిందని, కానీ ఇందులో ఏమాత్రం వాస్తవంలేదని కొట్టిపారేశారు. నాడు పీవీ నర్సింహారావు బాబ్రీమసీదు పరిసరాల్లో సైన్యాన్ని మోహరించారని గుర్తుచేశారు.
కానీ ఈ ఘటనకు కారకుడిగా పీవీని చిత్రీకరించడం, పార్టీకి ముస్లింలు దూరమయ్యారని పేర్కొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఏర్పాటుచేసిన లిబర్హాన్ కమిషన్ సైతం సైన్యాన్ని మోహరించిన విషయాన్ని వెల్లడించిందని ఉటంకించారు. సోనియాగాంధీ తన ఆత్మకథలో పీవీపై అభాండాలు వేయడం ఎంతో బాధనిపిస్తున్నదని పేర్కొన్నారు. కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. పీవీని సమున్నతంగా గౌరవించారని వాణీదేవి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గౌరవించకున్నా బీజేపీ పీవీ గొప్పతనాన్ని, దేశానికి అందించిన సేవలను గుర్తించి భారతరత్న ప్రదానం చేసిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

