Home
Telangana
Cpi National Coordinator K Narayana Criticizes Ap Government Over Night Courts Proposal
ఏపీని బీజేపీ ప్రభుత్వానికి ప్రయోగశాలగా మారుస్తారా?: నారాయణ
ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయోగశాలగా మారుస్తున్నదని సీపీఐ జాతీయ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కే నారాయణ విమర్శించారు.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ) ః ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయోగశాలగా మారుస్తున్నదని సీపీఐ జాతీయ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కే నారాయణ విమర్శించారు. ఏపీలో రాత్రి కోర్టులు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్న లక్ష్యం మంచిదే అని, కానీ న్యాయవ్యవస్థలో ఉన్న మౌలిక సమస్యలను పరిషరించకుండా సా ధ్యం కాదని పేర్కొన్నారు.
కోర్టుల పని వేళలను పొడిగించడం, ఉద్యోగ పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులతో రాత్రి కోర్టులు నిర్వహించడం ద్వారా ఏ విధమైన ఫలితాలు సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు కోర్టుల్లో పోస్టులను ఖాళీగా ఉంచి, ఉన్న సిబ్బందిపై అదనపు పని భారం మోపి, చివరకి ప్రజలను రాత్రివేళల్లో కోర్టులకు రావాల్సిన స్థితిలోకి నెట్టడం సమంజసమా? అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

