హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవ డం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇకపై తెలంగాణ లో ఎంత పెద్ద సినిమాకైనా బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్, మిడ్నైట్ షోల కు అనుమతులు ఇవ్వబోమని శుక్రవారం ఆయన స్పష్టంచేశారు. మహిళ మృతిపై హీరో, చిత్ర యూనిట్ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.