2023 Government Holidays list | వచ్చే ఏడాది సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023లో 28 సాధారణ సెలవులు, 24 ఆప్షనల్ సెలవులను ప్రకటించింది. అలాగే నెగోషియబుల్ యాక్ట్ కింద 23 రోజులను సెలవు దినాలుగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ సెలవుల్లో భాగంగా నూతన సంవత్సరం, సంక్రాంతి, దీపావళి ఆదివారం వచ్చాయి. భోగి, బతుకమ్మ ప్రారంభం రోజు రెండో శనివారం వచ్చాయి. మొత్తం 24 ఆప్షనల్ హాలిడేస్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు ఆప్షనల్ హాలిడేలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.
సందర్భం తేదీ వారం
నూతన సంవత్సరం జనవరి 1 ఆదివారం
భోగి జనవరి 14 శనివారం
సంక్రాంతి జనవరి 15 ఆదివారం
గణతంత్ర దినోత్సవం జనవరి 26 గురువారం
మహాశివరాత్రి ఫిబ్రవరి 18 శనివారం
హోలి మార్చి 7 మంగళవారం
ఉగాది మార్చి 22 బుధవారం
శ్రీరామనవమి మార్చి 30 గురువారం
బాబు జగ్జివన్ రాం జయంతి ఏప్రిల్ 5 బుధవారం
గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 7 శుక్రవారం
బీఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 శుక్రవారం
రంజాన్ ఏప్రిల్ 22 శనివారం
రంజాన్ అనంతరం సెలవు ఏప్రిల్ 23 ఆదివారం
బక్రీద్ జూన్ 29 గురువారం
బోనాలు జూలై 17 సోమవారం
మోహరం జూలై 29 శనివారం
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 మంగళవారం
శ్రీకృష్ణాష్టమి సెప్టెంబర్ 7 గురువారం
వినాయక చవితి సెప్టెంబర్ 18 సోమవారం
ఈద్ మిలాద్‌నబీ సెప్టెంబర్ 28 గురువారం
మహాత్మగాంధీ జయంతి అక్టోబరు 2 సోమవారం
బతుకమ్మ ప్రారంభం అక్టోబరు 14 శనివారం
విజయదశమి/దసరా అక్టోబరు 24 మంగళవారం
దసరా అనంతరం సెలవు అక్టోబరు 25 బుధవారం
దీపావళి నవంబర్ 12 ఆదివారం
కార్తీకపౌర్ణమి, గురునానక్ జన్మదినం నవంబర్ 27 సోమవారం
క్రిస్మస్ డిసెంబర్ 25 సోమవారం
బాక్సింగ్ డే డిసెంబర్ 26 మంగళవారం