హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : చదువుతూ సంపాదించడం, పరిశ్రమలు ఆశించిన నైపుణ్యా లు అర్జించేందుకు వీలు కల్పించే పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ వెనుకబడింది. ఈ పథకం లబ్ధిదారుల్లో రాష్ట్రం అత్యంత పే లవ ప్రదర్శన కనబరిచింది. మన రాష్ట్రం నుంచి మొదటి విడతలో 3,20 5 మంది లబ్ధిపొందగా, రెండో విడత లో 3,460 మంది మాత్రమే ఇంటర్న్‌షిప్ పొందారు. మన కన్నా అనేక రాష్ర్టా లు ముందంజలో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. 2024-25 బడ్జెట్లో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఐదేండ్లల్లో టాప్ 500 కంపెనీల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ కల్పించాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి నెలకు కొంత ైైస్టెపెండ్, సర్టిఫికెట్ సైతం అందజేస్తారు. 2025 జనవరిలో 1.18లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించారు. దీంట్లో తెలంగాణ వాటా మూడువేలే కావడం గమనార్హం. ఇంటర్న్‌షిప్ లబ్ధిదారుల్లో యూపీ టాప్‌లో ఉంది. వెనుకబడిన రాష్ట్రంగా పేరుపొందిన బీహార్ కూడా మనకంటే మెరుగ్గా ఉంది.