శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 16:15:37

డ‌బ్ల్యూసీఎస్ ద్వితీయ‌, తృతీయ‌ అవార్డుల‌ను గెలుచుకున్న తెలంగాణ అట‌వీ అధికారులు

డ‌బ్ల్యూసీఎస్ ద్వితీయ‌, తృతీయ‌ అవార్డుల‌ను గెలుచుకున్న తెలంగాణ అట‌వీ అధికారులు

హైద‌రాబాద్ : వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (డ‌బ్ల్యూసీఎస్) నిర్వహించిన పోటీలో తెలంగాణ అటవీ అధికారులు వన్యప్రాణి ఫోటోగ్రఫీ విభాగంలో రెండు జాతీయస్థాయి అవార్డుల‌ను గెలుచుకున్నారు. ఆదిలాబాద్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చంద్ర శేఖర్ రావు తన ఫోటో బెంగాల్ టైగర్ కు ద్వితీయ బ‌హుమ‌తి అదేవిధంగా మంచిర్యాల‌ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సిరిపుర‌పు మాధవ్ రావు త‌న క్రెస్టెడ్ హాక్ ఈగిల్ ఫోటోకు తృతీయ బహుమతిని గెలుచుకున్నారు.

గత వారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా డ‌బ్ల్యూసీఎస్‌ “ఉత్తమ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ్ 2020” పోటీని నిర్వహించింది.  తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న తిప్పేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం వద్ద చంద్రశేఖర్ రావు టైగర్ ఫోటో తీయగా, మాధవ రావు క‌వ్వాల్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో క్రెస్టెడ్ ఈగిల్ ఫోటో తీశారు. రాష్ట్రంలోని జ‌న్నారం ఫారెస్ట్ డివిజన్‌ను డ‌బ్ల్యూసీఎస్‌ ప్రత్యేకంగా ప్రస్తావించింది. వారి అద్భుతమైన ఛాయాచిత్రాలను ప్రశంసించింది. తెలంగాణ‌ అట‌వీ అధికారులు జాతీయ‌స్థాయిలో అవార్డులు గెలుపొందడంపై రాష్ర్ట‌ అటవీశాఖ మంత్రి ఇంద్రకరన్ రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభా, ఇతర సీనియర్ అధికారులు విజేతలకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. 

అసోంకు చెందిన లోయ‌ర్ అసోం డివిజ‌న్ చీఫ్ క‌న్జ‌ర్వేట‌ర్ ఆకాశ్‌దీప్ బారువా ఈ పోటీల్లో మొద‌టి బ‌హుమ‌తిని గెలుపొందాడు. మధ్యప్రదేశ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాహుల్ సింగ్ సికార్వార్ నాలుగో బహుమతిని గెలుచుకోగా, ఐదవ బహుమతి గౌహ‌తిలోని  కస్టమ్స్ డివిజన్ అయాన్ పాల్ ఇన్‌స్పెక్ట‌ర్‌కు ద‌క్కింది. ఈ చిత్రాల‌ను డ‌బ్ల్యూసీఎస్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. logo