హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ టీజీవో ఫోరం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా ఎం శ్రీనివాస్, కార్యదర్శిగా బీ ప్రభాకర్, సహా అధ్యక్షుడిగా జీ శ్రీధర్‌రావు, కోశాధికారిగా మహ్మద్ ఇసాక్, ఉపాధ్యక్షుడిగా కే అరుణ్, సహాయ కార్యదర్శులుగా సీహెచ్ శ్రీనివాస్, మీనాకుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బీ రామకృష్ణ, ప్రచార కార్యదర్శిగా బీ అంబేద్కర్, కార్యవర్గ సభ్యులుగా ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీ గంగామణిని ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి, టీజీవో ఉపాధ్యక్షుడు మాచర్ల రామకృష్ణగౌడ్ ప్రకటించారు.