Gift A Smile | గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబానికి తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ చేయూత అందించారు. బోడుప్పల్లో స్టీల్ ఫర్నీచర్ అండ్ వెల్డింగ్ వర్క్‌షాపును ఏర్పాటు చేయించారు.
నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు మండలానికి చెందిన నరేశ్ కుటుంబం పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చింది. అయితే సరైన ఉపాధి లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఈ విషయం ఇటీవల తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ దృష్టికి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో ఆ కుటుంబానికి అండగా నిలిచారు. బోడుప్పల్లో స్టీల్ ఫర్నీచర్ అండ్ వెల్డింగ్ వర్క్‌షాపును ఏర్పాటు చేయించి, ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు మందాడి సంజీవ్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రసాల మహేష్ యాదవ్, వేణు, ప్రకాష్ రెడ్డి, ఎస్ఎస్ఏ ట్రస్ట్ చైర్మన్ సాయి తదితరులు పాల్గొన్నారు.