హైదరాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వేలాదిమంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం సమాచారశాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద్రెడ్డిని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు బీ జగదీశ్వర్, గండ్ర నవీన్ కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 40ఏండ్లుగా జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని గుర్తుచేశారు.
అక్రెడిటేషన్లపై డెస్ జర్నలిస్టుల్లో ఆందోళన నెలకొన్నదని, హెల్త్‌కార్డులను ఇవ్వాలని, జర్నలిస్టుల తరఫున కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టులకు రాత్రి సమయాల్లో రవాణా సౌకర్యం కల్పించాలని, పని ప్రదేశాల్లో లైంగిక నిరోధక కమిటీలు వేయాలని కోరారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న క్రమంలో ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని సూచించారు. మీడియా అకాడమీ కార్యక్రమాలకు నిధులు పెంచాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్ వేయాలని వారు కోరారు.