రైతులను పిలిచి.. ఢిల్లీ వెళ్లిన మంత్రులు
రాష్ట్రంలో పంట పొలాలు ఎండిపోతున్నాయి. పంట చేతికందే దశ లో నీరందక నెర్రలుబారుతున్నది. అది చూడలేక అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. ఇలాంటి విపతర సమయంలో రైతులకు అండగా నిలువాల్సిన పాలకులు తమ రాజకీయ ప్రాధాన్యతల ను వెతుక్కుంటూ ఢిల్లీ విమానం ఎక్కారు. రైతుల కష్టాలను తెలుసుకొనేందుకు స్వ యంగా ప్రభుత్వమే ఖరారు చేసిన సమీక్షను అర్ధంతరంగా రద్దు చేసి, ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు అంతా ఢిల్లీకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మా రింది.
- కరువుపై సమీక్షకు రైతు వేదికల వద్దకు రావాలని పిలుపు
- తీరా రైతులు వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ రద్దయినట్టు ప్రకటన
- అంతలోనే 11:15 గంటలకు మీటింగ్ ఉన్నదని సమాచారం
- ఒంటి గంటకు వాయిదా
- అన్నదాతతో సర్కార్ ఆటలు
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంట పొలాలు ఎండిపోతున్నాయి. పంట చేతికందే దశ లో నీరందక నెర్రలుబారుతున్నది. అది చూడలేక అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. ఇలాంటి విపతర సమయంలో రైతులకు అండగా నిలువాల్సిన పాలకులు తమ రాజకీయ ప్రాధాన్యతల ను వెతుక్కుంటూ ఢిల్లీ విమానం ఎక్కారు. రైతుల కష్టాలను తెలుసుకొనేందుకు స్వ యంగా ప్రభుత్వమే ఖరారు చేసిన సమీక్షను అర్ధంతరంగా రద్దు చేసి, ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు అంతా ఢిల్లీకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మా రింది.
రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో, కరవు పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల12న ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రుల అనధికారిక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అక్టోబర్ 9న అధికారిక నోట్ జారీ చేశారు. ఆ భేటీ ముగిసిన వెంటనే మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయం ఆరో అంతస్తు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా అన్నదాతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, అందులో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొంటారని స్పష్టంగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకొని రైతాంగానికి తక్షణ భరోసా కల్పించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని సర్యులర్‌లో తెలిపారు.
గంటగంటకూ గందరగోళం
ఈ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ యంత్రాంగం రంగంలోకి దిగి గ్రామాల్లోని రైతులను రైతు వేదికల వద్దకు రప్పించింది. తీరా సమావేశ సమయం దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వ నిర్ణయాలు రైతులను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. ఉదయం 9:52 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ రద్దయిందని ఒక సందేశం పంపారు. ఆ తర్వాత కాసేపటికే ఉదయం 11:15 గంటలకు సమావేశం ఉంటుందని రైతులకు సమాచారం ఇచ్చారు. మళ్లీ కొద్దిసేపటికే మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం జరుగుతుందని, అయితే ముఖ్యమంత్రి రారని, డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి మాత్రమే మాట్లాడుతారని తెలిపారు.
గోవా పర్యటన ముగించి హస్తినకు సీఎం
ఒకవైపు గ్రామాల్లో ఎండిన పైర్లతో రైతులు ఆందోళన చెందుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గోవా పర్యటనను ముగించుకొని నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ఢిల్లీ బాట పట్టారు. బయటికి ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గోనేందుకు వెళ్లినట్టు చెప్తున్నప్పటికీ, అధిష్ఠానం వద్ద పార్టీ అంతర్గత వ్యవహారాలు, పదవుల సర్దుబాటు లెకలు తేల్చుకోవడానికే నాయకులంతా హస్తినకు వెళ్లారనే ప్రచారం జరుగుతున్నది. పొలాల్లో ఉన్న సమస్యలను పరిషరించడం కంటే రాజకీయ సమీకరణలే ప్రభుత్వానికి ముఖ్యమయ్యాయా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

