హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : అనుషశెట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ తెరకెకిస్తున్న చిత్రం ‘ఘాటి’. ఈ సినిమా ట్రైలర్‌పై రాష్ట్ర యాంటీ నారోటిక్స్ బ్యూరో(ఈగల్) అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈగల్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య చిత్ర బృందానికి బహిరంగ ప్రకటన విడుదలచేశారు.
సినిమా ట్రైలర్ గంజాయి సాగు, రవాణా, వినియోగం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నదని, ఇది మాదకద్రవ్యాల వ్యాపారాన్ని, వాడకాన్ని ప్రోత్సహించేలా ఉన్నదని పేర్కొన్నారు. ట్రైలర్లో డ్రగ్స్ వాడకంతో కలిగే నష్టాలపై చట్టబద్ధమైన హెచ్చరికలు, స్రోలింగ్ మెసేజ్‌లు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఇటువంటి కంటెంట్ యువత, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు.