కేరళ, కర్ణాటక నుంచి ఈ-సిగరెట్ల దందా
విద్యార్థులు, మైనర్లు, యువతను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్‌ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న ఫిర్యాదులపై ఎట్టకేలకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ దాడులు ముమ్మరం చేసింది.
- మత్తులోకి దిగుతున్న యువత
- 2 నెలల్లో ఏడు దుకాణాలపై దాడులు
- 10 కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తింపు
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు, మైనర్లు, యువతను లక్ష్యంగా చేసుకుని నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్‌ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న ఫిర్యాదులపై ఎట్టకేలకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ దాడులు ముమ్మరం చేసింది. తాజాగా హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో నిర్వహిస్తున్న ‘ది స్మోక్ షాప్’పై కుషాయిగూడ పోలీసులతో కలిసి దాడి చేసిన అధికారులు కేరళకు చెందిన ఉబైస్ (20), ఉస్సైనార్ పీహెచ్ (19)లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. ఈ అక్రమ వ్యాపారం కేరళ, కర్ణాటక రాష్ర్టాలు కేంద్రంగా నడుస్తున్నట్టు తెలుసుకున్నారు. అక్కడినుంచి ఇక్కడికి సరఫరా చేసే వ్యక్తులు, సంస్థలు కలిసి దాదాపు రూ.10 కోట్లకు పైగా లావాదేవీల నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ దిశగా దృష్టిపెట్టిన ఈగల్ ఫోర్స్.. మరింత లోతుగా కూపీ లాగుతున్నారు. తెలంగాణలో ఈ-సిగరెట్ల దందా జోరుగా సాగుతు న్నా.. గత రెండు నెలల్లో ఏడు దుకాణాలు, అవుట్లెట్లపై ఈగల్ ఫోర్స్ దాడులు చేసింది.
ర్యాపిడో ద్వారా సరఫరా
సైనిక్‌పురిలోని దుకాణానికి ఈ-సిగరెట్లను సరఫరా చేస్తున్న అర్షద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేరళకు చెందిన అర్షద్‌తో ఉబైస్కు బెంగళూరులో పరిచయం ఏర్పడినట్టు ఈగల్ అధికారులు తెలిపారు. వీరి అక్రమ వ్యాపారంలో డిజిటల్ వ్యవస్థలను వినియోగించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపార లావాదేవీలు, కస్టమర్లతో సంప్రదింపుల కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ నంబర్‌ను ఉపయోగించినట్టు గుర్తించారు. ఫోన్‌పే ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు కేరళలోని కాసర్గోడ్లో ఉన్న కెనరా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన సానర్ను ఉపయోగించినట్టు సమాచారం. సరుకును వినియోగదారులకు చేరవేసేందుకు ర్యాపిడో సేవలను వినియోగించినట్టు దర్యాప్తులో తేలింది.
రూ.10 కోట్ల లావాదేవీలపై ఆరా
చైనాకు చెందిన నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ రవాణా, విక్రయాల వెనుక ఉన్న విసృ్తత నెట్వర్ పైనా ఈగల్ ఫోర్స్ దృష్టి సారించింది. కేరళలోని కాసర్గోడ్, కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతాలకు సంబంధించి రూ.10 కోట్లకు పైగా లావాదేవీల ఆనవాళ్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ర్యాపిడో, పోర్టర్, ఉబర్ వంటి డెలివరీ, రవాణా సేవలను ఈ అక్రమ వ్యాపారంలో ఉపయోగించారా? ఉపయోగిస్తే ఆయా సేవల ద్వారా సరుకు రవాణా చేసిన వ్యక్తులకు వస్తువుల స్వభావం గురించి ముందస్తు సమాచారం ఉందా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, సరఫరాదారులు, దుకాణాల మధ్య సంబంధాలను విశ్లేషించిన తర్వాతే బాధ్యుల పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో సుమారు 45 మంది వినియోగదారులను గుర్తించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

