హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ భోపాల్‌లో నిర్వహించిన 24వ జాతీయస్థాయి పోలీస్ వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్లో సత్తా చాటిన మహిళా పోలీసులను డీజీపీ జితేందర్ అభినందించారు. గురువారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో వారిని సన్మానించారు. స్పోర్ట్స్ ఈవెంట్లో మహిళా పోలీసు జట్టు వివిధ విభాగాల్లో మొత్తం 12 మెడల్స్ సాధించింది.
కనోయింగ్-4 విభాగంలో 1000 మీటర్లు, 500 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో సత్తా చాటి మెడల్స్ సాధించారు. పతకాలు సాధించిన వారిలో దీపశ్రీ(సైబరాబాద్), సింధూజ(కరీంనగర్), పద్మ (డబ్ల్యూపీసీ 12322, సీఏఆర్ సైబరాబాద్), జే శిరీష (డబ్ల్యూసీ 349, ఎస్ఎస్ తాడ్వాయి పీఎస్, ములుగుజిల్లా) ఉన్నారు. వీరికి కోచ్‌లుగా కృష్ణారావు, ఆరీఫ్ ఖాన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ ఎం రమేశ్, స్పోర్ట్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు.