CM KCR | ప్రగతి ప్రస్థానం.. అస్థిత్వాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగో.. ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అస్థిత్వాన్ని ప్రతిబింబించేలా లోగోను రూపొందించింది. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో సీఎం కేసీఆర్ లోగోను ఆవిష్కరించారు.
CM KCR | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అస్థిత్వాన్ని ప్రతిబింబించేలా లోగోను రూపొందించింది. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో సీఎం కేసీఆర్ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి దేశానికే రోల్‌మాడల్‌గా నిలిచిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయం, 125 అడుగుల అంబేదర్ విగ్రహం చిహ్నాలను మేళవించి సీఎం ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు.
వీటితోపాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్థిత్వ చిహ్నాలతో తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో రూపుదిద్దుకొన్నది. కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాల సుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ శాంతికుమారి, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

