హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెల ంగాణ): ఎఫ్ఆర్బీఎంకు మించి అప్పులు చేశారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తమని, పరిమితికి లోబడే అప్పులు చేసినట్టు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. మంగళవారం టీవీ9 ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడారు. లెక్కలు ఎవరైనా చూసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ జమాఖర్చులపై పూర్తిగా కాగ్ ఆడిట్ చేస్తుందని వెల్లడించారు.
జవాబు: అది పచ్చి అబద్ధం. బోగస్ శ్వేతపత్రం. వీళ్లకి చరిత్ర, భూగోళం తెలియదు. అంత అజ్ఞానులు. పరిమితికి లోబడే అప్పులు చేశాం. లెక్కలు ఎవరైనా చూసుకోవచ్చు. నేను పదేండ్ల్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్న. ప్రతిపక్ష పార్టీలను దెబ్బగొట్టాలనే ఉద్దేశంతో నరేంద్రమోదీ ఎన్నికలకు మూడేండ్ల్ల ముందు రాష్ర్టాల అప్పులపై పూర్తిగా పరిమితి విధించారు. లేకుంటే మన రాష్ట్ర జీఎస్డీపీ రూ.16 లక్షల కోట్లకు చేరేది. ప్రస్తుతం రూ.14 లక్షల కోట్ల దగ్గర ఉన్నది. వివిధ ఫండింగ్ ఏజెన్సీల నుంచి రావాల్సిన వాటిని కూడా రాకుండా చేశారు. మార్చి 31 నుంచి మళ్ల్లీ మార్చి 31వరకు ప్రభుత్వ జమాఖర్చులపై పూర్తిగా కాగ్ ఆడిట్ చేస్తుంది. ఆ లెక్కలు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా సభ ముందు ఉంచుతారు. దానిపై కూడా గాలిమాటలు మాట్లాడితే ఎలా?
జవాబు: ఇది ఒక వికృతక్రీడ.
జవాబు: దేశంలో అత్యధిక క్యాపిటల్ ఎక్స్పెండేచర్ చేసిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ప్రతి సంవత్సరం పదిసార్లు చొప్పున చెప్పాయి. కాబ్టటి ఇదొక అర్థం లేని, పస లేని, బట్టకాల్చి మీద వేసే తుగ్లక్ చర్య అని అర్థం అవుతున్నది.