పరిమితిలోనే తెలంగాణ అప్పులు
రాష్ర్ట అప్పులు.. పరిమితికి లోబడే ఉన్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో మరోసారి నిర్ధారించింది. ఆర్బీఐ విడుదలచేసిన జూన్ నివేదికలో.. తెలంగాణ చేసిన అప్పు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణ కన్నా దాదాపు 13 పెద్ద రాష్ర్టాలు ఎఫ్ఆర్బీఎం పరిమితిని ఎప్పుడో దాటేశాయి
మరోసారి స్పష్టంచేసిన ఆర్బీఐ
13 పెద్ద రాష్ర్టాల్లో పరిమితికి మించి రుణాలు
రాజకీయ కక్ష సాధింపుతోనే రాష్ర్టానికి అడ్డంకులు
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ర్ట అప్పులు.. పరిమితికి లోబడే ఉన్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో మరోసారి నిర్ధారించింది. ఆర్బీఐ విడుదలచేసిన జూన్ నివేదికలో.. తెలంగాణ చేసిన అప్పు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణ కన్నా దాదాపు 13 పెద్ద రాష్ర్టాలు ఎఫ్ఆర్బీఎం పరిమితిని ఎప్పుడో దాటేశాయి. అయినప్పటికీ యూపీ, పశ్చిమబెంగాల్, పంజాజ్, ఏపీ వంటి రాష్ర్టాలు ఈ ఏడాది రుణాలు తీసుకోవడానికి సైతం కేంద్రం అంగీకరించింది. పరిమితికి లోబడే ఉన్న తెలంగాణకు మాత్రం అడ్డుపడుతున్నది. బీజేపీ సర్కారు తన రాజకీయ ప్రయోజనంకోసమే తెలంగాణ రుణ సమీకరణను అడ్డుకొంటున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిమితిలోపు ఉంటే కొత్తగా రుణాలు చేసేందుకు కేంద్రం అడ్డు చెప్పరాదు. ఎఫ్ఆర్బీఎం ప్రకారం జీఎస్డీపీ విలువలో 25% వరకు రుణాలు తీసుకొనే అవకాశం రాష్ర్టానికి ఉంటుంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ అప్పు 2019-20 నాటికి 23% మాత్రమే. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరాల అంచనాలు సైతం ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటలేదు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేయకుండా కేంద్రం ఆటంకాలు సృష్టిస్తున్నది. తెలంగాణ కంటే ఎక్కువ అప్పు చేసిన రాష్ర్టాలకు అదనంగా అప్పుచేసేందుకు అనుమతిచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం కొత్త రుణ సమీకరణలకు అడ్డుచెప్పడం ద్వారా రాష్ర్టాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయాలన్న దురుద్దేశం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎఫ్ఆర్బీఎం పరిమితికి దాటి అప్పులు చేసిన రాష్ర్టాలలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలతోపాటు అనేక పెద్ద రాష్ర్టాలున్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఆయా రాష్ర్టాల అప్పులు ఐదేండ్ల అనంతరం ఎలా ఉంటాయో ఆర్బీఐ అంచనావేసింది. దీని ప్రకారం తెలంగాణ అప్పు 13 పెద్ద రాష్ర్టాల కంటే తక్కువే ఉంటుందని పేర్కొన్నది. 2026-27 నాటికి తెలంగాణ అప్పు 29.8% ఉండవచ్చని తెలిపింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి’
భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

