TG CET’s | తెలంగాణలోని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లు నియామకమయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు సెట్లకు కన్వీనర్లను నియమించింది. యూనివర్సిటీ ఏ పరీక్ష నిర్వహించనున్నదో తెలిపింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్ జరుగనుండగా.. కన్వీనర్‌గా ప్రొఫెసర్ డీన్ కుమార్‌ను నియమించింది. జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈసెట్ నిర్వహించనున్నారు. పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ అరుణకుమారికి బాధ్యతలు అప్పగించింది.
ఐసెట్ నిర్వహణ బ్యాధతలు మహాత్మాగాంధీ వర్సిటీ చూసుకోనున్నది. ఐసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ అలువల రవి నియామకయ్యారు. ఈసెట్‌ను ఉస్మానియా వర్సిటీ నిర్వహిస్తుంది. ఈ సెట్‌కు కన్వీనర్‌గా ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించింది. లాసెట్, పీజీఎల్‌సెట్ ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో జరుగనుండగా.. కన్వీనర్‌గా ప్రొఫెసర్ విజయలక్ష్మిని ఉన్నత విద్యామండలి నియమించింది. కాకతీయ వర్సిటీ ఆధ్వర్యంలో ఎడ్‌సెట్ నిర్వహిస్తారు. ఇక కన్వీనర్‌గా ప్రొఫెసర్ బీ వెంకట్రాంరెడ్డి నియమించినట్లు పేర్కొంది. అలాగే, పీఈసెట్ పాలమూరు వర్సిటీ నిర్వహించనుండగా.. కన్వీనర్‌గా ప్రొఫెసర్ ఎస్ఎస్ దిలీప్‌కు బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో ఉన్నత విద్యామండలి వివరించింది.