హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభు త్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వు లు జారీచేశారు.
డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మండల స్థా యి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళిక రూపొందించాలని, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులను భాగస్వాముల చేయాలని తెలిపారు.