యాచారం, ఆగస్టు 24: తెలంగాణ సహకార సంఘాల పనితీరు బాగున్నదని ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల సీఈవోలు కితాబిచ్చారు. హైదరాబాద్లో శిక్షణకు హాజరైన పలు జిల్లాలకు చెందిన 25 మంది పీఏసీఎస్ సీఈవోలు బుధవారం రంగారెడ్డి జిల్లాలోని యాచారం సహకార సంఘాన్ని సందర్శించారు.
కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, సీఈవో నాగరాజుతో మాట్లాడి, సంఘం పనితీరు గురించి తెలుసుకొన్నారు. రికార్డులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఇక్కడి సహకార సంఘం పనితీరు ఎంతో బాగున్నదని వారు ప్రశంసించారు.