IND vs ENG | ఇంగ్లండ్‌కు ఆపద్భాందవులైన రూట్, డాసన్.. భారత్ ముందు తేలికైన లక్ష్యం..!
IND vs ENG : వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలినా మిడిలార్డర్ నిలబడింది. టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ రాణించగలనని చాటుతూ జో రూట్(76 నాటౌట్) అర్ధ శతకంతో మెరిశాడు.
IND vs ENG : వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ కుప్పకూలినా మిడిలార్డర్ నిలబడింది. ఎడ్జ్‌బాస్టన్‌లో గుర్నూర్ బ్రార్(2-61), ప్రసిధ్ కృష్ణ(2-50)లు ఒకే ఓవర్లో రెండేసి వికెట్లతో రెచ్చిపోగా.. 80 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు అనూహ్యంగా పుంజుకుంది. టెస్టుల్లోనే కాదు వన్డేల్లోనూ రాణించగలనని చాటుతూ జో రూట్(76 నాటౌట్) అర్ధ శతకంతో మెరిశాడు. లియాం డాసన్(68)తో కలిసి ఏడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పి పరువు కాపాడాడు. ఆఖర్లో అక్షర్ పటేల్(4-62) తిప్పేయగా ఇంగ్లండ్ 258కే కుప్పకూలింది.
ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి వన్డేల్లో ఇంగ్లండ్ తడబడినా సవాల్ విసిరేంత స్కోర్ చేసింది. పవర్ ప్లేలో అజేయంగా 51 రన్స్ చేసిన ఆతిథ్య జట్టుకు ఆ తర్వాత వరసగా వికెట్లు కోల్పోయింది. గుర్నూర్ బ్రార్(2-61) విజృంభణతో ఒకే ఓవర్లో జాకబ్ బెథెల్(14), బెన్ డకెట్(43) ఔటయ్యారు. రెండో బంతికి బెథెల్ వెనుదిరగగా.. నాలుగో బంతికి థర్డ్‌మ్యాన్ దిశగా డకెట్ సిక్సర్‌కు యత్నించగా.. బౌండరీ లైన్ వద్ద బుమ్రా ఒడుపుగా అందుకున్నాడు. దాంతో, 63 పరుగుల వద్ద ఆతిథ్య జట్టు రెండో వికెట్ కోల్పోయింది.
Convincing way to wrap the England innings 👏
Axar Patel registers his best figures in ODIs with 4⃣/6⃣2⃣ ✨
Updates ▶️ https://t.co/2sg194tpxH #TeamIndia | #ENGvIND | @akshar2026 pic.twitter.com/s1GVfIJTFj
— BCCI (@BCCI) July 14, 2026
ఆ తర్వాతి బుమ్రా ఓవర్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్(1) స్లిప్‌లో రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. టాపార్డర్ విఫలమైన వేళ జట్టును ఆదుకోవాలనుకున్న జోస్ బట్లర్(5)ను, సామ్ కరన్(0)ను ప్రసిధ్ కృష్ణ(2-50) వెనక్కి పంపాడు. అంతే.. ఇంగ్లండ్ కష్టాలు మరింత పెరిగాయి.
రూట్, డాసన్ పోరాటంతో
గుర్నూర్, ప్రసిధ్ల జోరుతో 80 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు.. 150, 180 కొడితే మహా గొప్ప అనిపించింది. కానీ, జో రూట్(76 నాటౌట్) ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తూ భారత బౌలర్లను విసిగించాడు. ఏడు పరుగుల వద్ద దూబే రిటర్న్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన రూట్.. ఆల్‌రౌండర్ లియాం డాసన్(68)తో కలిసి స్కోర్ బోర్డును నడిపించాడు.
When England need someone to step up, isn’t it always Joe Root? 🌟 pic.twitter.com/8HRynfcwdI
— Cricinfo (@cricinfo) July 14, 2026
కాస్త కుదురుకున్నాక ఇద్దరూ బ్యాట్లకు పని చెప్పారు శతక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయాన్ని విడదీసి అక్షర్ పటేల్(4-62) ఊరటనిచ్చాడు. డాసన్‌తో పాటు టెయిలెండర్లను డగౌట్ చేర్చిన అక్షర్.. ఇంగ్లండ్‌ను 258 పరుగులకే కట్టడి చేయడంలో కీలకమయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

