హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ గడువు మరో మూడు వారాలు పొడిగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ గడువు ఈ నెల 16తో ముగియనున్న నేపథ్యంలో శనివారం ఆయన ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
‘సర్’ గడువు పొడిగిస్తే ప్రస్తుతం అక్టోబర్‌లో వెలువడాల్సిన తుది ఓటర్ల జాబితా నవంబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు 47.79 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 32.39 లక్షల మంది హియరింగ్ హాజరు కాలేకపోయినట్టు అధికారులు తెలిపారు.