బడ్జెట్లో రూ.12.50 కోట్లు కేటాయింపు
హైదరాబాద్, మార్చి 7 : వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 బడ్జెట్లో హైదరాబాద్లోని 1,736 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం రూ. 12.50 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లోని ఆలయాలకు ఈ పథకాన్ని విస్తరించటం వల్ల రాష్ట్రంలో మొత్తం 5,381 ఆలయాలు ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం 3,645 దేవాలయాలకు నెలకు రూ.6 వేలు (రూ.2 వేలు ధూపదీప నైవేద్యాలకు, రూ.4 వేలు అర్చక వేతనం) ఇస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 5,381 ఆలయాలకు ప్రతి నెలా రూ.6 వేలు అందనున్నాయి.