శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 01:28:10

విద్యుత్‌కు 10,415 కోట్లు

విద్యుత్‌కు 10,415 కోట్లు
  • గతేడాది కంటే రూ.2 వేల కోట్లు అధిక కేటాయింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ర్టాభివృద్ధిలో కీలకాంశంగా ఉన్న విద్యుత్‌రంగానికి తాజా బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. వార్షిక బడ్జెట్‌లో విద్యుత్‌రంగానికి రూ. 10,415.88 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ ఖర్చు కింద రూ. 320.88 కోట్లు, పథకాల ఖర్చుకు రూ.10,095 కోట్లుగా ఉన్నాయి. గతేడాది మొత్తం రూ. 8,299.45 కోట్ల నిధులు ఇవ్వగా.. ప్రస్తుత బడ్జెట్‌లో దాదాపు రూ. 2,180 కోట్లు అదనంగా నిధులు అందించారు. 4,000 మెగావాట్ల యాదాద్రి, 1,080 మెగావాట్ల భద్రాద్రితోపాటు విద్యుత్‌ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు వీలుగా భారీగా నిధులు కేటాయించారు.logo