టెక్నాలజీ ట్రెండ్ సెట్టర్..అత్యాధునిక టెక్ హబ్‌గా తెలంగాణ
అధునాతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవటంలో, అభివృద్ధి చేయటంలో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్, డ్రోన్స్ అండ్ రోబోటిక్స్, ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, స్పేస్‌టెక్, క్లౌడ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ (ఏఆర్ అండ్ వీఆర్), త్రీడీ ప్రింటింగ్ తదితర సాంకేతికతలకు రాష్ట్రం కేంద్రంగా మారుతున్నది.
- ఈ- ఆర్థిక లావాదేవీల్లో నంబర్ వన్
- ప్రభుత్వ శాఖల్లో పేపర్‌లెస్ విధానం
- త్రీడీ ప్రింటింగ్లోనూ ముందంజ
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): అధునాతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవటంలో, అభివృద్ధి చేయటంలో తెలంగాణ శరవేగంగా దూసుకుపోతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్, డ్రోన్స్ అండ్ రోబోటిక్స్, ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, స్పేస్‌టెక్, క్లౌడ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ (ఏఆర్ అండ్ వీఆర్), త్రీడీ ప్రింటింగ్ తదితర సాంకేతికతలకు రాష్ట్రం కేంద్రంగా మారుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దిగ్గజ టెక్ కంపెనీలతోపాటు స్టార్టప్‌లు కూడా అత్యాధునిక సాంకేతికతలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర ఐటీ నివేదిక – 2021-22లో స్పష్టమైంది. కీలకాంశాలు ఇలా ఉన్నాయి…
- స్పేస్‌టెక్ ఫ్రేమ్‌వర్క్‌ను ఇటీవలే నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐటీ మంత్రి కేటీఆర్, ఇన్‌స్పేస్ సంస్థ చైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకా ఆవిష్కరించారు.
- త్రీడీ ప్రింటింగ్‌లో హైదరాబాద్ నేషనల్ హబ్‌గా అవతరించింది. నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మాన్యుఫాక్చరింగ్‌ను ఉస్మానియా వర్సిటీలో నెలకొల్పారు. ఇటీవలే మొదటి త్రీడీ ప్రింటింగ్ నేషనల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు.
- డ్రోన్లతో ఔషధాలు చేరవేసే అతిపెద్ద ప్రాజెక్టు ట్రయల్స్‌ను ఇటీవలే విజయవంతంగా నిర్వహించారు.
- సాగు బాగు పేరుతో అగ్రిటెక్ ప్రాజెక్ట్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో చేపట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఫర్ కాటన్, సీడ్ ట్రేసబిలిటీ, స్మార్ట్ ఇరిగేషన్ మేనేజ్మెంట్, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించే పైలెట్ ప్రాజెక్ట్‌ను అమలుచేస్తున్నారు.
ఈ -లావాదేవీల్లో టాప్
ఈ -లావాదేవీల్లో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అగ్రిగేషన్ అండ్ అనాలసిస్ లేయర్ వెల్లడించింది. మన దగ్గర ప్రతి వెయ్యి మందికి 1,39,524 ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 600కు పైగా సర్వీస్‌లు, 100కు పైగా ఏజెన్సీలు, 4,500కు పైగా మీ సేవా కేంద్రాలున్నాయి. యాప్‌లు, మీ సేవా పోర్టల్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 2.6 కోట్ల ప్రజలకు ఇవి సేవలందిస్తున్నాయి.
- వినియోగించేవారు 30,800
- రూపొందించిన ఫైళ్లు 7,91,648
- సర్క్యులేషన్లో ఉన్నవి 63,59,351

టీ వర్క్స్
- యంత్రాల తయారీలో సమస్యల పరిష్కారానికి టీ వర్క్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు.
- ఏడాది వ్యవధిలో 162 మంది సమస్యల పరిష్కారం.
ఈ – ఆఫీస్
పరిపాలనలో సంస్కరణలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక విభాగాల్లో ఎలక్ట్రానిక్ ఆఫీస్ విధానాన్ని అనుసరిస్తున్నది. 30 సచివాలయ శాఖలు, 113 హెచ్వోసీలు, పురపాలికలు, 33 జిల్లాలు, 137 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 56 పాలిటెక్నిక్‌లలో కాగిత రహిత పాలన అమలుచేస్తున్నారు. త్వరలోనే మండలస్థాయి వరకు దీనిని విస్తరించనున్నారు. ఉస్మానియా, జేఎన్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీల్లో ఈ ఆఫీస్ ప్రక్రియ వేగవంతమైంది. సింగరేణి కాలరీస్, హైకోర్టు కోసం ప్రత్యేకంగా ఈ ఆఫీస్‌లను రూపొందించారు.
తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్
- ప్రభుత్వ శాఖలకు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌ను సమకూర్చే ఏజెన్సీగా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సేవలందిస్తున్నది. ప్రతిష్ఠాత్మక ధరణి పోర్టల్‌లోని పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ, దళితబంధు స్మార్ట్ కార్డులు, పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన సిటిజన్ హెల్త్ రికార్డుల తయారీ, సీసీటీవీల ఏర్పాటుకు ఈ సంస్థ చర్యలు చేపట్టింది.
- ధరణి పోర్టల్ ద్వారా 31 మార్చి 2022 వరకు 14.62 లక్షల రిజిస్ట్రేషన్లు.. ప్రభుత్వానికి రూ. 2,533 కోట్ల ఆదాయం.
- ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఫెస్ట్) పేరుతో 17 రకాల సేవలు స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి. 2021 సంవత్సరానికి ఏఐ క్యాటగిరీలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు.
- 28 శాఖల్లో పారదర్శకత కోసం ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టం.
- ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్లో భాగంగా 500కు పైగా సృజనలు వెలుగులోకి. 108 సృజనాత్మక ఆలోచలనతో జిల్లాల్లో ప్రదర్శనలు.
- మొట్టమొదటి ‘ఇంటింటా ఇన్నోవేటర్ గ్రామీణ అవార్డు’లను రాష్ట్రంలోని నాలుగు గ్రామపంచాయతీలు గెలుచుకొన్నాయి.
- స్కూల్ పిల్లలు, కౌమార దశలోని పిల్లల ఆలోచనలకు వాస్తవ రూపం ఇచ్చేందుకు యూనిసెఫ్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న వై హబ్‌ను ఇటీవలే మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు.
టీ హబ్
- టీ హబ్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్.
- ఇప్పటి వరకు చేపట్టిన ఇన్నోవేషన్ ప్రోగ్రాంలు 100కు పైనే.
- 2021-22 533 స్టార్టప్‌ల అభివృద్ధి.
- టీ హబ్ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో స్టార్టప్‌లు 400. ఇప్పుడు వాటి సంఖ్య 2 వేలు.
- త్వరలో టీ హబ్ ఫేజ్-2 ప్రారంభం.
- స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ ఫండ్ ఏర్పాటు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయింపు. ఇప్పటికే 3 స్టార్టప్‌లకు రూ. 1.5 కోట్లు విడుదల.
- పెట్టుబడులు, సీఎస్ఆర్ పెంచేందుకు టీ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (టీ ఎస్ఐజీ) ఏర్పాటు. కరోనా సమయంలో దవాఖానల్లో ఆక్సిజన్, మాస్కులు, బెడ్స్ వంటి అవసరాలను తీర్చటంలో కీలకపాత్ర.
వీ-హబ్

ఔత్సాహిక మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వీ-హబ్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 67 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు వీ-హబ్ తోడుగా నిలుస్తున్నది.
టైర్-2, టైర్-3 నగరాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ-హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు 354 మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది. రూరల్ ఇంక్యుబేషన్ ద్వారా 17 మంది మహిళలకు అండగా నిలిచింది. మాడల్ మున్సిపాలిటీ ప్రాజెక్ట్ ద్వారా రామగుండం మున్సిపాలిటీ పరిధిలో 166 మంది మహిళలకు రూ.7.39 కోట్ల రుణాలు ఇచ్చింది. ట్రైకార్ ఇంక్యుబేషన్ ప్రొగ్రాం ద్వారా 93 మందికి రూ.5.09 కోట్ల రుణాలిచ్చింది. కరీంనగర్ జిల్లాల్లో దళితబంధు ద్వారా 790 మందికి ఈడీపీ శిక్షణ ఇవ్వగా, 174 మంది వ్యాపారాలు ప్రారంభించారు.
- డాటా సైన్స్‌లో 13-18 ఏండ్ల వయసున్న 75 మంది అమ్మాయిలకు ప్రత్యేక శిక్షణ.
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా 13 మంది ఇంక్యుబేటర్స్‌కు రూ.4.5 కోట్ల నిధులు.
- మహిళా పారిశ్రామికవేత్తలకు మొత్తం ఫండింగ్ రూ.66.30 కోట్లు.
- 5,235 మందికి పారిశ్రామికరంగంలో శిక్షణ.
- 2,194 స్టార్టప్స్, ఎస్ఎంఈల ఏర్పాటు.
- 21 కొత్త స్టార్టప్ ప్రోగామ్ల రూపకల్పన.
- 53 సంస్థలతో ఒప్పందాలు.
- 2,823 మందికి ఉపాధి
టాస్క్

- విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఏర్పాటు.
- టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొన్న ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలు 718.
- టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొన్న విద్యార్థులు మూడు లక్షలకు పైగానే.
- టాస్క్ ద్వారా శిక్షణ పొందిన మొత్తం విద్యార్థులు 6,53,189 మంది. ఈ ఏడాది శిక్షణ పొందినవారు 1,07,020 మంది.
- టాస్క్ ద్వారా శిక్షణ పొందిన అధ్యాపకులు 14,388 మంది. ఈ ఏడాది శిక్షణ పొందినవారు 2 వేల మంది.
- విద్యార్థులకు ఉద్యోగావకాశాల కోసం ఇన్ఫోసిస్, ఐబీఎం, గూగుల్ తదితర సంస్థలతో ఒప్పందాలు.
- ఇప్పటి వరకు 6,213 మందికి ఉద్యోగాలు. ఇన్ఫోసిస్‌లో 2.225 మందికి కొలువులు.
టీ ఫైబర్
- రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు టీ ఫైబర్ ప్రాజెక్టు.
- నెట్వర్క్ ఏర్పాటు కోసం 22,298 కిలోమీటర్ల లైన్లు అవసరం కాగా, ఇప్పటివరకు పూర్తయింది 17,328 కిలోమీటర్లు.
- 5,614 గ్రామ పంచాయతీలకు నెట్వర్క్ కనెక్షన్ పూర్తి.
- టీ ఫైబర్ ద్వారా 97,115 ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక.
- ‘మన ఊరు-మన బడి’లో భాగం గా విద్యార్థులకు డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు సహకారం.
టీ శాట్

- విద్యార్థులకు, ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చేందుకు టీ శాట్ ఏర్పాటు.
- టీ శాట్ యూజర్లు 36 లక్షలు. వ్యూస్ 14.95 కోట్లు.
- ప్రభుత్వ పథకాల ప్రచారానికి డిజిటల్ మీడియా విభాగం.
- ట్విట్టర్లో తెలంగాణ సీఎంవోకు 13.76 లక్షల మంది ఫాలోవర్స్. ప్రతి వెయ్యి మందిలో తెలంగాణ సీఎంవో ఫాలోవర్స్ సగటున 39.3 మంది. ఫెస్‌బుక్‌లో 8.51 లక్షల మంది, యూట్యూబ్‌లో 6,140 మంది ఫాలోవర్స్.
- మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో 9.05 లక్షల మంది, ఫేస్బుక్లో 5.18 లక్షల మంది ఫాలోవర్స్.

ఈ లావాదేవీలు ఇలా..
- 1,39,524 రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది ఏటా చేస్తున్న ఎలక్ట్రానిక్ ఆర్థిక లావాదేవీల సంఖ్య 4,500 కోట్లురాష్ట్రంలో ఏటా నమోదవుతున్న ఎలక్ట్రానిక్ ఆర్థిక లావాదేవీల విలువ
- 2.6 కోట్లు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ లావాదేవీలు నిర్వహిస్తున్న జనాభా
- ఎలక్ట్రానిక్ ఆర్థిక లావాదేవీల్లో తెలంగాణ స్థానం
ఫేస్బుక్, ట్విట్టర్ ఫాలోవర్స్


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

