హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బాలికల విద్యకు తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగంగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పీజీలో 72శాతం, డిగ్రీలో 52శాతం,గురుకులాలు,కేజీబీవీల్లో 69 శాతం మంది బాలికలు చేరడం అభినందనీయమని అన్నారు. బీఈడీ ఫస్టియర్లో 81 శాతం బాలికల అడ్మిషన్లతో, ఉన్నత విద్యలో బాలికల ఎన్రోల్మెంట్ రేషియోలో జాతీయ సగటును మించి తెలంగాణ ఫలితాలను సాధిస్తున్నదని ఆమె వెల్లడించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కేటాయింపులో తెలంగాణ పట్ల పూర్తి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా, వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. కొత్త విద్యాసంస్థల ఏర్పాటు,మౌలిక వసతుల కల్పనతో, ఉన్నత విద్యలో బాలికలు పెద్ద ఎత్తున చేరుతుండటం గర్వకారణమని ఆమె తెలిపారు.