హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తేతెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం కోటా ఇస్తామని ధోకా చేసిన కాంగ్రెస్ సర్కారుపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేటీఆర్‌ను నందినగర్‌లోని నివాసంలో కలిశారు.
బీసీ బిల్లుపై తమిళనాడు తరహాలో పోరాడి కేంద్రం మెడలువంచుదామని అసెంబ్లీ సాక్షిగా మీరు చేసిన విజ్ఞప్తిని సీఎం రేవంత్‌రెడ్డి పెడచెవినపెట్టారని విమర్శించారు. పోరా టంతోనే మోసపూరిత కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని కోరారు. ఇందుకు కేటీఆర్ సైతం సానుకూలంగా స్పందించారని తెలిపారు.