హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. సభలో ఆయన వ్యవహరించిన అనుచిత ప్రవర్తనపై శనివారంలోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ కార్యాలయం నోటీసులు అందజేసింది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 29న అసెంబ్లీలో గనుల తవ్వకాల అవకతవకలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకున్నది. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్‌రెడ్డి జోక్యం చేసుకుని, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయనను ప్రశ్నించారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి చేతులతో సైగలు చేయడం వివాదానికి దారితీసింది.