హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న 20వేల మంది ఆర్టిజన్లు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మూడునెలల క్రితం బేషరతుగా సమ్మె విరమించిన ఆర్టిజన్ల డిమాండ్ల పట్ల సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించడం పట్ల వారు గళం విప్పనున్నారు. అందులో భాగంగా ఈ నెల 22 న మహాధర్నా నిర్వహించాలని తెలంగాణ ఆర్టిజన్ జేఏసీ నిర్ణయించింది. హక్కుల సాధన కోసం ఆర్టిజన్లు ఏప్రిల్లో పదిరోజుల పాటు సమ్మె చేశారు.
ఆ సమ్మె మూ లంగా విద్యుత్తు శాఖకు చాలా సమస్యలు రావడంతో అప్పట్లో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, ప్రొఫెస ర్ కోదండరాం మధ్యవర్తిత్వం వహించి డిమాండ్లను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వపెద్దలతో హామీ ఇప్పించి సమ్మె విరమింపచేశారు. కానీ మూడునెలలు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో వారు ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు.