సింగరేణి కార్మికులకు రూ.596 కోట్ల వాటా
సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటాను ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఒక్కో కార్మికుడికి రూ.1,53,912 బోనస్‌గా చెల్లించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. మంగళవారం బేగంపేటలోని ప్రజాభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి లాభాల వాటాను భట్టి ప్రకటించారు.
- ఒక్కో కార్మికుడికి రూ.1,53,912 బోనస్
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన
- సొంతింటి కల నెరవేరుస్తామని వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటాను ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఒక్కో కార్మికుడికి రూ.1,53,912 బోనస్‌గా చెల్లించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. మంగళవారం బేగంపేటలోని ప్రజాభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి లాభాల వాటాను భట్టి ప్రకటించారు. సంస్థలో పనిచేస్తున్న 38,737 మంది పర్మినెంట్ కార్మికులకు లాభాల వాటా అందుతుందని చెప్పారు. సంస్థలో పనిచేస్తున్న 29,717 మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్‌గా చెల్లిస్తామని తెలిపారు. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.1,754 కోట్ల నికర లాభాలు ఆర్జించగా 34 శాతం వాటాగా రూ. 596 కోట్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు.
*కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తం
సింగరేణి కార్మికులు, ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. సొంత ఇండ్లు నిర్మించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 250 – 300 డిపెండెంట్ ఉద్యోగాల భర్తీని 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. కరోనా కాలంలో తొలగించిన వారికి వన్‌టైమ్ చాన్స్ కింద తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, కార్మికుల పెర్క్స్ అలవెన్స్‌లపై ఆదాయపు పన్నును కూడా సంస్థ తరఫున ప్రభుత్వానికి చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మూడేండ్ల కాలంలో జెన్కో, ట్రాన్స్‌లు సింగరేణికి రూ. 27 వేల కోట్లు బకాయిపడ్డాయని, క్రమంగా ఆ బకాయిలు చెల్లిస్తామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

