నిఖత్ జరీన్‌కు జూబ్లీహిల్స్‌లో 600 గజాల స్థలం
nikhat zareen | అంతర్జాతీయ క్రీడల్లో అద్భుత విజయాలను సాధిస్తూ భారతదేశం కీర్తితో పాటు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యంగ్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్‌లో 600 గజాల స్థలాన్ని రాష్ట్ర క్రీడాశాఖ తరఫున కేటాయించగా.. నిఖత్ జరీన్ తండ్రికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేశారు.
హైదరాబాద్ : అంతర్జాతీయ క్రీడల్లో అద్భుత విజయాలను సాధిస్తూ భారతదేశం కీర్తితో పాటు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో 600 గజాల స్థలాన్ని రాష్ట్ర క్రీడాశాఖ తరఫున కేటాయించగా.. నిఖత్ జరీన్ తండ్రికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. త్వరలోనే నిఖత్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదిలా ఉండగా.. గతేడాది టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ స్వర్ణపతకం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలను సాధించిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.2కోట్ల నగదు బహుమతితో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది రూ.2కోట్ల నగదు చెక్కును సీఎం కేసీఆర్ అందజేయగా.. తాజాగా ప్రభుత్వం ఇంటి స్థలాన్ని అందజేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

