Tehsildar’s Transfer | రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రెండు మల్టీజోన్ల పరిధిలో 417 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రాత్రి తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బదిలీలు చేపట్టగా.. మూడేళ్లకుపైగా పని చేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ ఆదేశాలు చేసింది. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపడుతున్నది.