హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. హైదరాబాద్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో అసోసియేట్ ప్రెసిడెంట్‌గా వెంకట నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏ లక్ష్మయ్య, అదనపు కార్యదర్శిగా బండెల రవి, సంస్థ, సాంకేతిక, ప్రణాళిక, మహిళా కార్యదర్శులుగా సంపతిరావు, జే శ్రీనివాస్, బాబు నాయక్, టీ శ్రీలేఖ, కేంద్ర కార్యవర్గ సభ్యులుగా సాయితేజ, సాయిరాం ఎన్నికయ్యారు.
అలాగే జెన్కో కంపెనీ ప్రెసిడెంట్‌గా ఎం గిరిబాబు, కంపెనీ సెక్రటరీగా టీ ప్రవీణ్‌కుమార్ ఎన్నికయ్యారు. కాగా, టీఈఈఏ అధ్యక్షుడిగా శివాజీ గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.